Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారు ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాను: సీనియర్ హీరోయిన్ రాజశ్రీ

  • అప్పటికి నాకు డ్రైవింగ్ అంతగా రాదు
  • మలుపులో ఎదురుగా లారీ వచ్చేసింది 
  • తాను ఊహించలేదన్న రాజశ్రీ
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ రాజశ్రీ మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు. "1972లో నేను ఒక కన్నడ సినిమాలో నటిస్తున్నాను. దొంగలు ఛేజ్ చేస్తుంటే నేను వేగంగా కారు నడుపుతూ తప్పించుకునే సీన్ ను తీస్తున్నారు. అప్పటికి నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు. ఎర్లీ మార్నింగ్ షూటింగ్ కావడంతో, ఎదురుగా ఏమీ రావులే అనుకున్నాను.

కానీ మలుపులో ఎదురుగా లారీ వచ్చింది. కారును పక్కకి తీద్దామనుకుంటే అటుగా ఎడ్ల బండి వచ్చింది. దాంతో కారును మరింత పక్కకి తీయడంతో, రోడ్డు పక్కనే వున్న రాయిని కొట్టుకుని ఆగింది. నాకు గాయాలై సీట్లోనే స్పృహ కోల్పోయాను. ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్లెవరూ నేను బతుకుతానని అనుకోలేదు. ఆ గాయాల కారణంగా ఇతర సినిమాల షూటింగులోను నేను ఇబ్బందులు పడిన సందర్భాలు వున్నాయి' అని చెప్పుకొచ్చారు.
Rajasri
Senior Heroine
Tollywood

More Telugu News